అంబేద్కరిజం
జై భీమ్.. జై స్వేరో..సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు
ఇది అంబేద్కర్ ఈజమ్...
చీమ ఎప్పుడు
సోమరి కాదు
క్రమశిక్షణ కు మారుపేరు
ఇది అంబేద్కర్ ఆలోచనా...
గొర్రెలు గుంపులుగా వెళ్తాయి ఎందుకో తెలుసా
మంచి తనము మనసులో నింపుకొనీ
అడుగులు ముదుకేస్తాయ్
ఇది అంబేద్కర్ వాదం...
కుక్కలు మొరుగు తాయ్ విశ్వసానికి గుర్తుగా ఇది అంబేద్కర్ మాట
సీతాకోకచిలుక ఒంటరి ప్రయాణము
ధైర్యంగా ఉండమని
ఇది అంబేద్కర్ విజయం...
ప్రకృతిలో పక్షులన్నీ తమ కాలగమనంలో
మార్పులకు అను గుణంగా నడుస్తాయ్..
మరి మానవుడు అంటరానితనాన్ని
అరచేతిలో పెట్టుకొని ఆరడుగుల మనిషి
మూడడుగులకు తన స్వభావాన్ని కుదించుకుంటూన్నాడే
ఎన్ని జన్మలు కుదించుకోవాలిల
అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలు, ఆదాయాలు, ఆచారాలు, హక్కులు,
పోరాటంలో ఉండే ఐక్యత పొరాటములో ఉండే ఆలోచనా
పోరాటంలో ఉండే సంతృప్తి, తృప్తి, విజయం...
ఇవన్నీ అంబేద్కర్ శిల్పంపై చూపుడు వేలు శాసించింది
ఆ చూపుడు వేలే సమాజాన్ని నీలదిస్తుంది? ప్రశ్నిస్తుంది? వణికిస్తోంది...!