🌸ఆయన ఒక అద్భుతం🌸
బుద్ధుని తమ్ముడు ఆనందుడు. తన అన్న భిక్షువు కాగానే తానూ భిక్షువుగా మారాడు. చిన్నతనం నుంచి అన్న వెంటే ఉండేవాడు. ఊహ తెలిసిన నాటి నుంచి బుద్ధుడు పరినిర్వాణం పొందేవరకూ ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఆనందుడు అందగాడు. మంచి శరీర సౌష్ఠవం. తేజస్సు ఉట్టిపడే ముఖం. ఒక రోజున అతను వేరే గ్రామం పోతూ దప్పికగొన్నాడు. ఆ ఊరి చివరి ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఒక అందమైన అమ్మాయి నీళ్లు తోడుకుంటోంది. ఆనందుడు వెళ్లి- ‘‘అమ్మా! దాహంగా ఉంది. మంచి నీళ్లు పోయి’’ అని దోసిలిపట్టాడు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి, ‘‘స్వామీ! నేను అంటరాని కులానికి చెందిన అమ్మాయిని. మీకు నీళ్లు పోసే అర్హత నాకు లేదు’’ అది భయంగా, వినయంగా. ‘‘అమ్మా నేను నీళ్లు అడిగాను. కులం అడగలేదు’’ అన్నాడు. అయినా ఆమె చాలా సంశయించింది. చివరికి నీళ్లు పోసింది. ఆనందుడు ఒంగి నీళ్లు తాగుతున్నాడు. ఆ క్షణంలో ఆమె మనసు ఉప్పొంగింది. ఆనందుని అందం, ఆదర్శం ఆమె మనసును తట్టిలేపాయి. ‘‘స్వామీ! నన్ను వివాహం చేసుకోండి’’ అంది. ‘‘అమ్మా నేను సంసారాన్ని వదిలి వచ్చేశాను. నాతో వివాహం నీకు జరగని పని. నీ మోహాన్ని కట్టిపెట్టు’’ అన్నాడు. ఆమె కాళ్లా వేళ్లాపడింది. దారికి అడ్డం నిలబడింది. ఆమెకు నచ్చజెప్పి ఆనందుడు వెళ్లిపోయాడు.అంబేద్కరిజం జై భీమ్.. జై స్వేరో.. సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు ఇది అంబేద్కర్ ఈజమ్... చీమ ఎప్పుడు ...
No comments:
Post a Comment