Friday, August 24, 2018

  అంబేద్కరిజం
జై భీమ్..          జై స్వేరో..

సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు
ఇది అంబేద్కర్ ఈజమ్...

చీమ ఎప్పుడు 

సోమరి కాదు
క్రమశిక్షణ కు మారుపేరు
ఇది అంబేద్కర్ ఆలోచనా...



గొర్రెలు గుంపులుగా వెళ్తాయి ఎందుకో తెలుసా
మంచి తనము మనసులో నింపుకొనీ
అడుగులు ముదుకేస్తాయ్

ఇది అంబేద్కర్ వాదం...

కుక్కలు మొరుగు తాయ్ విశ్వసానికి గుర్తుగా 
ఇది అంబేద్కర్ మాట

సీతాకోకచిలుక ఒంటరి ప్రయాణము
ధైర్యంగా ఉండమని 

ఇది అంబేద్కర్ విజయం...

ప్రకృతిలో పక్షులన్నీ తమ కాలగమనంలో
మార్పులకు అను గుణంగా నడుస్తాయ్..


మరి మానవుడు అంటరానితనాన్ని
అరచేతిలో పెట్టుకొని ఆరడుగుల మనిషి
మూడడుగులకు తన స్వభావాన్ని కుదించుకుంటూన్నాడే


ఎన్ని జన్మలు కుదించుకోవాలి
ల  

అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలు, ఆదాయాలు, ఆచారాలు, హక్కులు,
పోరాటంలో ఉండే ఐక్యత పొరాటములో ఉండే ఆలోచనా
పోరాటంలో ఉండే సంతృప్తి, తృప్తి, విజయం...



ఇవన్నీ అంబేద్కర్ శిల్పంపై చూపుడు వేలు శాసించింది
ఆ చూపుడు వేలే సమాజాన్ని  నీలదిస్తుంది? ప్రశ్నిస్తుంది? వణికిస్తోంది...!

                                                       🌸ఆయన ఒక అద్భుతం🌸

బుద్ధుని తమ్ముడు ఆనందుడు. తన అన్న భిక్షువు కాగానే తానూ భిక్షువుగా మారాడు. చిన్నతనం నుంచి అన్న వెంటే ఉండేవాడు. ఊహ తెలిసిన నాటి నుంచి బుద్ధుడు పరినిర్వాణం పొందేవరకూ ఆయనకు సేవలు చేస్తూ ఉండేవాడు. ఆనందుడు అందగాడు. మంచి శరీర సౌష్ఠవం. తేజస్సు ఉట్టిపడే ముఖం. ఒక రోజున అతను వేరే గ్రామం పోతూ దప్పికగొన్నాడు. ఆ ఊరి చివరి ఒక బావి ఉంది. ఆ బావి దగ్గర ఒక అందమైన అమ్మాయి నీళ్లు తోడుకుంటోంది. ఆనందుడు వెళ్లి- ‘‘అమ్మా! దాహంగా ఉంది. మంచి నీళ్లు పోయి’’ అని దోసిలిపట్టాడు. ఆ అమ్మాయి ఉలిక్కిపడి, ‘‘స్వామీ! నేను అంటరాని కులానికి చెందిన అమ్మాయిని. మీకు నీళ్లు పోసే అర్హత నాకు లేదు’’ అది భయంగా, వినయంగా. ‘‘అమ్మా నేను నీళ్లు అడిగాను. కులం అడగలేదు’’ అన్నాడు. అయినా ఆమె చాలా సంశయించింది. చివరికి నీళ్లు పోసింది. ఆనందుడు ఒంగి నీళ్లు తాగుతున్నాడు. ఆ క్షణంలో ఆమె మనసు ఉప్పొంగింది. ఆనందుని అందం, ఆదర్శం ఆమె మనసును తట్టిలేపాయి. ‘‘స్వామీ! నన్ను వివాహం చేసుకోండి’’ అంది. ‘‘అమ్మా నేను సంసారాన్ని వదిలి వచ్చేశాను. నాతో వివాహం నీకు జరగని పని. నీ మోహాన్ని కట్టిపెట్టు’’ అన్నాడు. ఆమె కాళ్లా వేళ్లాపడింది. దారికి అడ్డం నిలబడింది. ఆమెకు నచ్చజెప్పి ఆనందుడు వెళ్లిపోయాడు.

ఆ అమ్మాయి పేరు ప్రకృతి. ఆమె విచారంతో ఇంటికి వెళ్లింది. ఆనందుని మీద ప్రేమ పెరిగి, విరహ బాధతో మంచం పట్టింది. నిద్రాహారాలను పక్కనపెట్టింది. తిరగడం మానేసింది. ఒకటే ప్రేమ ప్రేలాపన! ప్రకృతి తల్లి కూడా ఒకసారి ఆనందుణ్ణి ఇంటికి ఆహ్వానించింది. అప్పుడతణ్ణి బెదిరించింది, బతిమిలాడింది. పాదాలపై పడి, తన బిడ్డను బతికించమని వేడుకొంది. అయినా ఆనందుడు ఆ ఇంటి నుంచి బైటపడి వెళ్లిపోయాడు. ‘‘బుద్ధుడు ఈ ఆనందుని అన్నగారే. ఆయన మాటంటే తమ్ముడు కాదనడు. వెళ్లి ఆయనకు చెప్పండి’’ అని సలహా ఇచ్చారు కొందరు. తల్లీబిడ్డలిద్దరూ బుద్ధుని దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పారు. వేడుకొన్నారు. బుద్ధుడు ఆమెలో ఆనందునిపై ప్రేమను గ్రహించి, ‘‘అమ్మా నీవడిగిందే చేస్తాను. ముందు ఇంటికి వెళ్లి స్నానం చేసి, భోజనం చేసి రా’’ అన్నాడు. ప్రకృతి ఆనందంతో వెళ్లి, మర్నాడు అలంకరించుకొని వచ్చింది. ‘‘నీవు ఆనందుణ్ణి ప్రేమిస్తున్నావు కదా! మరి ఆనందుడు నిన్ను ప్రేమించాలంటే నీవు అతనికి ఇష్టమైనట్లు నడుచుకోవాలి కదా’’ అన్నాడు. ‘‘భగవాన్‌! చెప్పండి. వారికి ఎలా ఇష్టమో అలా నడుచుకుంటాను’’ అంది ప్రకృతి. ‘‘ఆనందునికి ఒంటిపూజ భోజనం ఇష్టం’’ అన్నాడు. ‘‘భగవాన్‌! అలాగే. నేను ఒంటి పూట భోజనం చేసి పది రోజుల తర్వాత వస్తాను’’ అని వెళ్లి, అలాగే వచ్చింది.

 

                           ‘‘ప్రకృతీ! ఆనందునికి నేల మీద పడక ఇష్టం’’

 

‘‘భగవాన్‌ అలాగే’’ అని వెళ్లి మరో పది రోజుల తర్వాత వచ్చింది. ‘‘ప్రకృతీ! ఆనందుణ్ణి చూడు. కాషాయదుస్తులు ధరిస్తాడు. అలంకారాలు, ముఖ లేపనాలు ఉపయోగించడు. అత్యంత నిరాడంబరంగా ఉంటాడు’’ అన్నాడు బుద్ధుడు.

‘‘భగవాన్‌! నేనూ అలాగే ఉంటాను’’ అని వెళ్లి మరో పది రోజుల తర్వాత వచ్చి- ‘‘భగవాన్‌ ఇంకా నేను ఏమి చేస్తే ఆనందునికి ఇష్టమో చెప్పండి!’’ అని అడిగింది. ‘ఆనందుణ్ణి చూశావా! తల మీద వెంట్రుకలు కత్తిరించుకొని గుండుతో ఉంటాడు’’. ‘‘అలాగే భగవాన్‌!’’ అని, పది రోజుల తర్వాత గుండుతో వచ్చి ‘‘ఇంకా..’’ అంది. ’’ఆనందుడు నిత్యం ధ్యానం చేస్తాడు. ధర్మప్రబోధాలు వింటాడు’’ అన్నాడు బుద్ధుడు. ‘‘నేనూ చేస్తాను, వింటాను’’ అంది. అక్కడే కొన్నిరోజుల పాటు ఉంది. ఆమెకు నెమ్మదిగా జ్ఞానోదయం కలిగింది. ఒకరోజున బుద్ధుని దగ్గరకు వచ్చి, నమస్కరించి నిలబడింది. ‘‘ప్రకృతీ! నీవంటే ఆనందుడు ఇష్టపడతాడు’’ అన్నాడు. ‘‘భగవాన్‌! నాకు ఆనందుని మీద ప్రేమ లేదు. మోహం లేదు. ధర్మం మీద ప్రేమ కలిగింది. నా జీవితాంతం ధర్మ ప్రచారంలో బ్రతకనివ్వండి’’ అంది. ఆమెను కోపగించుకోకుండా, కొట్టకుండా, తిట్టకుండా ఆమెలోని మోహాన్ని తుంచి మానవీయతగా మలచిన బుద్ధుడు మహాద్భుతం.

Thursday, January 12, 2012

శ్రీ కాళోజి - తెలంగాణ కవి


శ్రీ కాళోజి నారాయణ రావు గారు అందరికి కాళోజి గా కాళన్న గా ఎరుక. 1914 సెప్టెంబరు 9న జన్మించిన కాళోజి గారు ప్రముఖ స్వాతంత్ర యొద్దుడు,తెలంగాణా వాది. తెలంగాణము ఈయన మాటలలో, నడవడికలొ కొట్టొచ్చినట్టు కనబడెది.

Wednesday, July 27, 2011

ప్రొఫెసర్‌ జయ శంకర్‌ ...ఒక దీపస్తంభం

తాము పూర్తిగా ఏకీభవించని వారినెవరినైనా ఇతరులు గౌరవిస్తున్నారంటే అది వారి వ్యక్తిత్వానికి ప్రతీక. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అక్షరాలా అలాటి వ్యక్తి. అరవై ఏళ్లపాటు ఒకే మాటకు బాటకు కట్టుబడి నిస్వార్థంగా నిష్కల్మషంగా నిలబడ్డారు. తెలంగాణా విముక్తికి మొదటి తరంలో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి వంటి వారు ప్రతీకలైతే ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటు తర్వాత కాలంలో ఆ ప్రాంత సమస్యలకు ఆయన ప్రతిధ్వని అయ్యారు. అది పదవులతో ప్రచారాలతో సంబంధం లేని భావాత్మక ప్రాతినిధ్యం. అనుకున్నది జరక్కపోయినా ఆకాంక్షకే కట్టుబడిన దృఢమైన ప్రాతినిధ్యం. విద్యా రంగంలో వున్నతమైన బాధ్యతలు నిర్వహించినా రాజకీయ నేతలకు గురుపీఠంలో భాసించినా జయ శంకర్‌ నిబద్ధంగా నిరాడంబరంగా సంచరించారు. తనకు చాలా ఇష్టమైన మాటల్లో చెప్పాలంటే చెన్నారెడ్డి నుంచి చిన్నా రెడ్డి వరకూ రకరకాలైన రాజకీయ పాత్ర ధారులు మారారు గాని తాను సూత్రధారిగానే వుండిపోయారు.వచ్చీ పోయే నౌకలకు దారి చూపిస్తూ వుండిపోయే దీపస్తంభమే
అయ్యారు.ఆయన ఆలోచనలను అన్ని వేళలా అందరూ ఒప్పుకుని వుండకపోవచ్చు గాని ఆయన అంకిత భావం, అధ్యయన శీలత, ఆచరణకు ప్రాదాన్యత నివ్వడం, ఆడంబరాలకు అట్టహాసాలకూ దూరంగా వుండటం ఇవన్నీ ఆదర్శప్రాయమైనవి.
నాయకత్వం అనేక విధాల పట్టుపడుతుంది. భూస్వామ్య సంప్రదాయాలు గల దేశాల్లో కుటుంబ వారసత్వం వొక మార్గం. పదవుల వల్ల, పై నుంచి ఆమోదం వుండటం వల్ల, ఒకానొక చారిత్రిక సన్నివేశం వల్ల మనుషులు నాయకులవువుతుంటారు. కాగా తమ నైతికతతోనూ జ్ఞాన సంపదతోనూ పట్టుదలతోనూ పోరాట పటిమతోనూ మరికొందరు నాయకత్వ పాత్ర పోషించగలుగుతారు. అధికార పూర్వకమైన నాయక స్థానాలలో మార్పులు చేర్పులుంటాయి గాని నైతిక సైద్ధాంతిక కారణాల వల్ల లభించే నాయకత్వాలు అలా కాదు. వర్తమాన తెలంగాణా రాజకీయ దృశ్యంలో జయ శంకర్‌ది అలాటి నైతిక నాయకత్వమే. అది బలం బలహీనత కూడా.బలం ఏమిటంటే ఆటు పోట్లకు అతీతంగా కొనసాగడం.బలహీనత ఏమంటే తమ భావ పరివ్యాప్తికి ఎవరిపైనైనా ఆధారపడవలసి రావడం. నాయకుడు ఎవరైనా నేను నా భావాల విస్తరణకే ఉపయోగించుకున్నానని ఆయన తరచూ చెబుతుండేవారు. అయితే ఈ ఉపయోగించుకోవడం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. ఈ సంగతి తెలుసు కనకే వీలైనంత వరకూ ప్రత్యక్ష పదవులకు దూరంగా మసిలారు. 1969 ఉద్యమం తర్వాత చెన్నారెడ్డి తనను ఎన్నికల్లో పోటీ చేయమని పిలిస్తే నిరాకరించానని,అలా చేసి వుంటే తను కూడా ఒక మదన్‌ మోహన్‌ లాగా మిగిలిపోయేవాడినని ఆయన ఒకసారి ఈ రచయితతో మాట్లాడుతూ అన్నారు. దాదాపు గంట సేపు రాష్ట్ర రాజకీయాలకు, వ్యక్తులకు సంబంధించి వివిధాంశాలపై జరిపిన చర్చ ఆయన అవగాహన విస్త్రతికి అద్దం పట్టిందనే చెప్పాలి.అప్పటికే ఆయన జర రుజ భారాలతో కాస్త మెత్తగా వున్నారు.
1952కు ముందు తెలంగాణా ప్రతేక రాష్ట్ర వాదన వుండేది కాదని సుందరయ్య రాశారు. తర్వాత కూడా ప్రత్యేక రాష్ట్రం కోరిన వారిలో భిన్న తరహాలకు చెందిన వారున్నారు. తరాలకు చెందిన వారున్నారు. 1954లో ఫజల్‌ అలీ కమిటీ దగ్గరే ప్రత్యేకంగా వుండాలని జయశంకర్‌ మెమోరాండం ఇచ్చారంటే మొదటి నుంచి ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పాటుకు ఆయన వ్యతిరేకంగానే వున్నారనేది స్పష్టం. ఫజల్‌ అలీ సిఫార్సులపైన వాటి అమలుపైన అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే ఆనాడు దానికి మెమోరాండాలు ఇచ్చిన కాంగ్రెస్‌ నేతలు పలువురు తర్వాత తమ వైఖరి మార్చుకున్నారు. ఉదాహరణకు రాష్ట్ర ఏర్పాటుపై హడావుడి వద్దని అంతకన్నా ముందే దస్త్రం సమర్పించిన నీలం సంజీవరెడ్డి తర్వాత తనే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. మర్రి చెన్నారెడ్డి, కె.వి.రంగారెడ్డి వంటివారు మంత్రులయ్యారు. తమ రాజకీయ భవితవ్యాలు మారగానే ప్రత్యేక మంత్రం చేపట్టి మళ్లీ మానుకున్నారు. ఆ దశలో జయ శంకర్‌ వారికి మద్దతుగా నిలిచి తర్వాత నిరుత్సాహానికి గురైనారు. ఇక వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి హయాంలోనూ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ ప్రత్యేక రాష్ట్ర పల్లవి ఆలపించి సోనియా గాంధీకి మెమోరాండం ఇచ్చినప్పుడు వారితోనూ జయ శంకర్‌ వుండి విషయ పుష్టి కలిగించేందుకు కారకులైనారు.
అంతకు ముందు కాలంలో విభజన ఉద్యమానికి 90 ల తర్వాతకూ తేడా ఏమంటే అస్తిత్వ రాజకీయాలకు అంతర్జాతీయంగా ప్రోత్సాహం పెరగడమే. ఆ పదం వాడినా వాడక పోయినా మొదటి నుంచి ఆ తరహాకు చెందిన ఆలోచనలు కలిగిన జయ శంకర్‌ వంటి మేధావులకు ఈ వాతావరణం కూడా బాగా దోహదం చేసింది. ఈ ప్రాంతంలో వెనకబాటు గురించి, అసమానతలు లేదా తాము అనుకునే వివక్షల గురించి సమాచార తాత్విక భూమిక ఏర్పాటుచేయడం అవసరమని వారు గుర్తించారు. ప్రపంచీకరణ విధానాల ఉధృతితో పెరిగిన సమస్యలను ప్రాంతీయ కోణాన్ని మేళవించి విస్త్రతమైన అధ్యయన ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. దీని ఫలితమేమంటే అప్పటి వరకూ పాలక వర్గ రాజకీయ వేత్తల పాచికలకే పరిమితమైన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక సిద్ధాంత రూపం తీసుకున్నది. తాను సిద్ధాంత కర్తనని జయ శంకర్‌ నొప్పుకోకపోయినప్పటికీ ఈ కోణంలో ఆయన చిరకాల భావాలు అస్తిత్వ సిద్దాంతాలకు అచ్చంగా సరిపోయాయి. కె.సి.ఆర్‌ 2000 తర్వాత తెలుగు దేశం నుంచి వైదొలగాక, ప్రత్యేక రాష్ట్ర నినాదం తీసుకుని టిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశాక సహజంగానే జయ శంకర్‌ దానికి భీష్మ పితామహుడుగా మారాడు. భారతంలో భీష్ముడి పాత్ర పూర్వాపరాలు సుప్రసిద్ధమైనవే.
వామపక్షాల విద్యుదుద్యమ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి 2004లో కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత వైఎస్‌ వైఖరి ఎలా మారిందీ రెండు చోట్ల రెండు రకాల ఎలా మాట్లాడిందీ ఎవరూ కాదనలేని సత్యం. ఇప్పుడు ప్రధాన పార్టీలు సాగిస్తున్న ద్వంద్వ భాషణం అప్పుడు ఒక్క గొంతుతోనే వినిపించిన ఘనాపాటీ వైఎస్‌! అయితే ఇదంతా పాలక పక్షాలకూ ఆ నాయకులకు సర్వ సాధారణమైన విషయం. వ్యూహాత్మకత ప్రయోజనాల పరిరక్షణ పేరుతో వారు దేన్నయినా సమర్థించుకోగలరు. జయ శంకర్‌ వంటివారు అలా గాక అనుకున్నదానికే కట్టుబడి వాదనలు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే ఆయన కమ్యూనిస్టేతర రాజకీయవాదులతోనే సన్నిహితంగా మెలిగినట్టు కనిపిస్తుంది. ప్రాంతీయ సమస్యలనుంచి ప్రపంచ సమస్యల వరకూ అన్నిటి పట్లా దృష్టి సారించే మార్క్సిస్టు రాజకీయాలకు ఒక ఉప ప్రాంతంపై ప్రధానంగా దృష్టి నిలిపే వైఖరికి మధ్యన తేడాలుండటంలో ఆశ్చర్యం లేదు. మరోవైపున ఆయనతో మమేకమైనట్టు కనిపించే పార్టీలైనా సరే ఆయన చెప్పిన ప్రతిదీ అమలు చేశాయని గాని చేయగలవని గాని అనుకోవడం కష్టం. భావాత్మక రాజకీయాలకూ వ్యూహాత్మక రాజకీయాలకూ తేడా అక్కడే వస్తుంది. అలాటి తేడాలు ఎన్ని వున్నా ఆ రేఖలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వాన్ని అందరూ గౌరవించడమే గొప్ప విశేషం.

ఇక జయ శంకర్‌కు నివాళి సందర్భంలో కనిపించిన కొన్ని అవాంఛనీయ ఘటనలు ఆయన అనుసరించిన ఈ ఉన్నత జీవన సంప్రదాయాలకు అనుగుణమైనవి కావని చెప్పక తప్పదు. పూర్తిగా వ్యతిరేకించేవారికి కూడా గౌరవించే అవకాశం కలిగించడం ఆయన ఔన్నత్యానికి నిదర్శనమవుతుంది తప్ప నివాళిని నిరసనకు నిలయంగా చేయనవసరం లేదు. అనిశ్చితికి అసలైన చిరునామాగా మారిన ఈ రాష్ట్రంలో రేపు ఏ నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో, అసలు వెలువడుతుందో లేదో ఎవరికీ తెలియదు.తన రాజకీయ లాభనష్టాల లెక్క తేలేవరకూ కేంద్రం ఎలాటి ప్రకటన చేసే ప్రసక్తి వుండదు. ఇప్పుడున్న గజిబిజి అస్తవ్యస్త పరిస్తితులలో ఆ లెక్క అంత సులభంగానూ తేలదు. అందుకే అధిష్టానం దాగుడు మూతలు విరమించిన దాఖలాలు లేకపోగా సందేహాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ విధంగా ప్రాంతాలతో ప్రజలతో చెలగాటమాడుతున్న కేంద్రం వైఖరిని తెలుగు ప్రజలంతా నిరసించాల్సిన సమయమే తప్ప ఇది పరస్పరం ఉద్రేకాలు పెంచుకోవసిన పని లేదు. ప్రజలు ఎక్కడున్నా ప్రజలే. ప్రొఫెసర్‌ జయ శంకర్‌ అనుకున్న అవగాహనకు ప్రాధాన్యత నిచ్చారే గాని అసహనానికి కాదు. అదే సంయమనం, చర్చా సంప్రదాయం కొనసాగించడం ప్రజాస్వామిక పరిష్కారాలకు మార్గం సుగమం చేస్తుంది. ఫజల్‌ అలీ కమిటీ నుంచి శ్రీకృష్ణ కమిటీ వరకూ నడిచిన చరిత్ర అందరికీ అనేక పాఠాలు నేర్పింది. సవ్యంగా అధ్యయనం చేసేట్టయితే రేపటికి బాట చూపుతుంది. ఆ విధంగా స్వాతంత్రానంతర ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్రలో ప్రొఫెసర్‌ జయ శంకర్‌కు తనదైన స్తానం వుంటుంది. చరిత్ర నిరంతరం నిర్మించబడుతూనే వుంటుంది తప్ప ఒక స్థిరబిందువు దగ్గర ఆగిపోదు.

Monday, January 25, 2010

వరంగల్ - మేడారం టూర్



Medaram Jatara (Telangana Festival)
Medaram is a village in the “dandakaaranya” (Tadvai forest ) area of the Mulugu taluk of Warangal district, about 150-km away from Warangal city. Here Sammakka Jatara, non-Vedic and non-Brahminical festival is celebrated once in two years on a very large scale for four days in January-February. It is a rare confluence of different tribes and castes and their traditions at this biennial Indian fair. Medaram Festival is considered to be the largest festival in the South India and is one of the largest festivals in the world. This year (2012), it was estimated that approximately 10 million devotees visited the shrine.

History, Mythology and practices: According to a tribal story, about 6-7 centuries ago, a group of Koya Indians traveling through the dandakaaranya found a little girl playing with tigers. The head of the tribe adopted and named her Sammakka. She married the headman of a neighboring village. Saaralamma was her daughter. The Koya Indians were a tributary to the Kakatiyas, who ruled the country of Andhra from Warangal City between 1000 AD and 1380 AD. Once, the Koyas assisted the Kakatiyas in a war. After sometime, there was a severe drought that lasted for years and as a result the mighty Godavari River dried up. Koyas didn’t have even food to eat. However, the Kakatiyas insisted on the payment of taxes. The Kakatiya emperor sent his forces to teach the Koyas a lesson and collect taxes and the Koyas had no option but to resist. After a bitter war, the Kakatiya Prime Minister visited war ravaged Koya kingdom. By then most of the Koya chiefs had fallen in battle. The Prime Minister proposed peace and offered Sammakka a place in the emperor’s harem as the chief queen. Samakka turned down the offer and resolved to continue the fight to avenge the dead. The battle continued and Samakka was wounded. Samakka told her people that as long as they remembered her, she would protect them. Then, she cursed the Kaktiya dynasty to perish and disappeared into the deep forest. The Koyas searched for their queen and found only a red ochre box, her bangles and the pug-marks of a huge tigress. Soon after, Muslim invaders destroyed the Kakatiya dynasty. Since then, the Koyas, Waddaras and other Indian tribes and castes have been holding festivals in memory of Sammakka and Saralamma regularly.

There is no permanent idol of the deity. It is said that a Koya boy who gets a vision before the festival, searches in the forest for a week without food and sleep and finally brings the goddesses in the farm of two vermilion caskets tied to a piece of bamboo, one representing the main deity Sammakka and the other her daughter Saarakka or Saaralamma. The actual festival begins in the month of Magha, on Suddha Pournami (full moon day) evening when Saaralamma would be traditionally brought from Kanneboyinapalle, a village in the forest, and installed on a gaddi (the throne or platform), an earthen platform raised under a tree. Animals are sacrificed and intoxicants such as liquor are widely used.

Hundreds of people who are often possessed by the goddess come there dancing ecstatically throughout their journey. The special offering to the deity is jaggery. Some offer jaggery equal to their weight and distribute. It is a rare opportunity to witness some ancient practices especially pabba, Shiva sathi (sathi means lady) and Lakshmi Devaras. Shiva sathis are women who go into trance and bless the childless women to have children and the process of that blessing is called pabba. The belief is that those who had the blessings of Sammakka-Saralamma through the words of Shiva sathis would have children. Children get their heads tonsured. Young girls accompanied by their parents performed special prayers with the help of Shiva sathis and Lakshmi Devaras to get suitable husbands.


Saturday, November 28, 2009

మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?


మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
నేను అబ్జర్వ్ చేసిన కొన్ని అంశాలని క్రోడీకరించి మీకు ఈ సూచనలు ఇస్తున్నాను

1. మీ బ్లాగు కి విజిటర్స్ పెంచుకోవాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగుకి విజిటర్స్ ని పెంచడం ఎలా?” అని ఒక టపా వ్రాయాలి

2. మీ బ్లాగుకి ఫుల్లుగా కామెంట్స్ కావాలంటే ఏమి చేయాలి?
-”మీ బ్లాగు కి కామెంట్స్ రావాలంటే” అని హెడ్డింగ్ పెట్టి ఒక టపా వ్రాయాలి.
(కామెంట్స్ కోసం అయితే ఇంకొన్ని మార్గాలు కూడా ఉన్నాయి :
3. ముందుగా అన్ని బ్లాగులను పరిశీలించి మంచి టపాలు వ్రాయాలి.
ఇది కేవలం సరదాకి వ్రాసింది. జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు.

  అంబేద్కరిజం జై భీమ్..          జై స్వేరో.. సింహం ఎప్పుడు పరుగు తీస్తూనే ఉండాలి వేటలో అలసిపోగూడదు ఇది అంబేద్కర్ ఈజమ్... చీమ ఎప్పుడు  ...

డా.బి.ఆర్.అంబేడ్కర్ - Dr.B.R.Ambedkar-डॊ.भीमराव रामजी आंबेडकर

డా.బి.ఆర్.అంబేడ్కర్ - Dr.B.R.Ambedkar-डॊ.भीमराव रामजी आंबेडकर
He is my Role Model

ప్రముఖ వ్యక్తులు....

ప్రముఖ వ్యక్తులు....
ప్రజల కోసం ప్రాణలు అర్పించిన మహానీయులు